: స్వైన్ ఫ్లూ దెబ్బకు 144 సెక్షన్ విధించారు!
స్వైన్ ఫ్లూ మహమ్మారి భారత్ లో ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో చెప్పేందుకు ఇదో నిదర్శనం. గుజరాత్ లోని అహ్మదాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ ప్రభావాన్ని తగ్గించేందుకు కలెక్టర్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. రోడ్లపై గుంపులుగా కనిపించరాదని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎక్కువ మంది కలిసి వెళ్లాల్సి వస్తే అనుమతి తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ లోనే స్వైన్ ఫ్లూ మరణాలు ఎక్కువని వైద్య శాఖ నివేదికలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా, అహ్మదాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడమే అధికార వర్గాల ఆందోళనకు కారణం.