: రామ్ జెఠ్మలాని, కిషోర్ కుమార్ భార్య లిప్ లాక్ నేపథ్యం ఇదే...!


దివంగత గాయకుడు కిషోర్ కుమార్ భార్య, అలనాటి అందాల నటి లీనా చందావర్కర్ పెదవులను ఓ వేదికపైన ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ చుంబించడం సంచలనం రేపింది. ఈ లిప్ లాక్ ఫొటో వార్తల్లో ప్రముఖంగా రావడమే కాకుండా, సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే, ఈ ఘటనపై లీనా స్పందించారు. తాను కూడా వేదికపైకి వెళ్లాల్సి ఉందని... ఆ సమయంలో తాను పైకి ఎక్కడానికి జెఠ్మలానీ సహాయం కోరానని... అతను తనకు చేయి అందించి సహాయం చేశారని చెప్పారు. అనంతరం, తనను ఓ ముద్దుపెట్టుకుంటానని పర్మిషన్ అడిగారని... వ్యక్తిగతంగా గొప్ప న్యాయవాది అయిన జెఠ్మలానీకి తాను పెద్ద అభిమాని కావడంతో వెంటనే ఓకే చెప్పానని, దీంతో జెఠ్మలానీ తనను ముద్దాడారని చెప్పారు. 92 ఏళ్ల జెఠ్మలానీ పూర్తి జీవితాన్ని చూశారని లీనా చెప్పారు. చూడ్డానికి ఆయన కఠోరంగా కనిపించినా, ఆయన హృదయం మాత్రం చాలా గొప్పదని చెప్పారు. ఆయన ప్రసంగాలతో తాను చాలా ప్రభావితమయ్యానని తెలిపారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి తన ఫోన్ కంటిన్యూయస్ గా రింగ్ అవుతూనే ఉందని, అనేక మెసేజ్ లు వస్తున్నాయని చెప్పారు. తనకు ఇబ్బంది కలిగేలా చాలా కామెంట్లు వస్తున్నాయని... ఇలాంటి వాటిని కేర్ చేయనని లీనా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News