: రూ. 10 కోట్లతో యాదవ భవన్: కేసీఆర్
ఇప్పటికే వివిధ కులాలకు, మతాలకు భవనాలు నిర్మిస్తానని చెప్పిన టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాదులో రూ. 10 కోట్ల వ్యయంతో యాదవ భవన్ నిర్మిస్తామని తెలిపారు. ఇటీవలే టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి చేపట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, నోముల నర్సింహయ్య కేసీఆర్ ను కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని యాదవ కులానికి చెందిన ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.