: కుప్పం ద్రవిడ వర్శిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కుప్పం ద్రవిడ యూనివర్శిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం, ఇంజినీరింగ్ కళాశాలలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. అటుపై, కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో 'స్మార్ట్ కుప్పం' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా కురిశాయని, ఎంత వ్యయమైనా సరే ఈ ఏడాది చివర్లోగా నీటిని అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.