: మాయమైన భారీ లాభాలు!


సెషన్ ఆరంభంలో నమోదైన భారీ లాభాలు అమ్మకాల ఒత్తిడి, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా దిగొచ్చాయి. బడ్జెట్ పై ఆశావహ దృక్పథంతో తొలుత ఉత్సాహం నెలకొన్నప్పటికీ, యూరప్ మార్కెట్ల అనిశ్చితి పెట్టుబడిదారుల సెంటిమెంట్ పై ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. బుధవారం నాటి స్టాక్ మార్కెట్ సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 3.33 పాయింట్లు పెరిగి 0.01 శాతం లాభంతో 29,007.99 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ సూచీ 5.15 పాయింట్లు పెరిగి 0.06 శాతం లాభంతో 8,765.25 పాయింట్ల వద్ద కొనసాగాయి. ఏసీసీ, హెచ్డీఎఫ్సి, భారతి ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు లాభాలను, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, టాటా పవర్ తదితర కంపెనీలు నష్టపోయాయి.

  • Loading...

More Telugu News