: జగన్ సోషల్ మీడియాలో అడుగుపెడుతున్నారా?
సోషల్ మీడియాను ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చో ప్రధాని నరేంద్ర మోదీని చూసి తెలుసుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో మోదీ సామాజిక మాధ్యమం సాయంతో సగం నెగ్గుకొచ్చారు. ప్రజలతో వ్యక్తిగత సంబంధాల ప్రాధాన్యతను ఆ తర్వాత ఎందరో రాజకీయ ప్రముఖులు గుర్తించి, ఒకరి తర్వాత ఒకరుగా సోషల్ మీడియాలోకి దూకారు. తాజాగా, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ కూడా ట్విట్టర్లో ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. ఇప్పుడు ఈ వార్తే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. కాగా, ఆయన ట్విట్టర్ అకౌంట్ తెరిస్తే, తొలి ట్వీట్ ఏ అంశంపై చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్సీపీకి ఫేస్ బుక్ పేజీ ఉన్నా, కార్యకర్తలకు, అభిమానులకు వ్యక్తిగతంగా అందుబాటులో ఉండాలంటే సోషల్ మీడియాలో ప్రవేశించడం తప్పనిసరి అని పార్టీ నేతలు జగన్ కు తెలిపారు. వారి విజ్ఞప్తులను పరిశీలించిన పిమ్మట ట్విట్టర్లో ప్రవేశించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.