: మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ రాజీనామా
మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ రాజీనామా చేశారు. అటవీ రక్షణదళ పరీక్షల అవకతవకల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్ టీఎఫ్ నిన్న(మంగళవారం) ఆయనపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసింది. ఈ క్రమంలో పదవి నుంచి దిగిపోవాలని కేంద్రం ఈ ఉదయం ఆయనను కోరింది. దీంతో ఆయన పదవి నుంచి వైదొలగారు. అటవీ రక్షణదళాల నియామకం కోసం పరీక్ష నిర్వహించిన మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (ఎంపీపీఈబీ) ఉన్నతాధికారులకు గవర్నర్ ఐదుగురి పేర్లను సిఫారసు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.