: భూసేకరణ బిల్లుపై జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఆందోళన
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. పారిశ్రామిక వర్గాలను మెప్పించేందుకే ఆ బిల్లును రైతులకు వ్యతిరేకంగా మార్చారని విమర్శించింది. దానిపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. నరేంద్రమోదీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలతో పనిచేస్తోందని ఆరోపించింది. అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఇంతవరకు ఇచ్చిన హామీలను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించింది. ఈ ఆందోళనలో పార్టీ సీనియర్ నేతలు అశ్వనీ కుమార్, అజయ్ మాకెన్, దిగ్విజయ్ సింగ్, వీహెచ్, సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆందోళనను గ్రామస్థాయికి తీసుకువెళతామని చెప్పారు.