: రజనీకాంత్ ఇంట వేడుక... వెల్లివిరిసిన ఆనందం
సూపర్ స్టార్ రజనీకాంత్ రెండవ కుమార్తె సౌందర్య సీమంతం కుటుంబ సభ్యుల మధ్య కన్నులపండుగగా జరిగింది. చెన్నై రాయపేటలో ఉన్న పోయస్ గార్డెన్ లోని రజనీ నివాసంలో సోమవారంనాడు ఈ వేడుకను నిరాడంబరంగా నిర్వహించారు. సౌందర్యకు 2010లో వ్యాపారవేత్త అశ్విన్ తో వివాహం జరిగింది. పెళ్లి అయిన నాలుగేళ్లకు పైగా సౌందర్య దంపతులు సంతానానికి దూరంగా ఉన్నారు. ఇటీవలే ఆమె గర్భం దాల్చడంతో, రజనీ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తోంది. త్రీడీ యానిమేషన్ చిత్రం కొచ్చాడియాన్ కు ఆమె దర్శకురాలిగా పని చేశారు.