: సినీ పరిశ్రమకు డ్రగ్స్ ముఠాకు సంబంధంపై ఆధారాలు లేవు... వెల్లడించిన పోలీసులు


హైదరాబాదు నగరంలో ఇటీవల పట్టుబడ్డ నైజీరియా డ్రగ్స్ ముఠాకు తెలుగు సినిమా పరిశ్రమకు మధ్య సంబంధాలపై తమ వద్ద ఆధారాలు లేవని, ఆధారాలు లేకుండా తాము మాట్లాడలేమని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు వివరించారు. ఈ కేసులో నిందితులను నేడు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నలుగురు నైజీరియన్లతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన నిర్మాత సుశాంత్ రెడ్డి, ఈవెంట్ మేనేజర్ పనాస రవిలను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీరిద్దరూ మినహా పరిశ్రమకు చెందిన వారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. వీరి నుంచి 90 గ్రాముల కొకైన్, 40 ప్యాకెట్ల గంజాయి, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నైజీరియన్స్‌ కాల్ డేటా ఆధారంగా విచారించమని, టాలీవుడ్ ప్రముఖులెవరూ లేరని తేలిందని చెప్పారు.

  • Loading...

More Telugu News