: మే లోగా ‘అయోధ్య’పై తేల్చండి... లేదంటే ఆందోళనే: మోదీకి వీహెచ్ పీ హెచ్చరిక


అయోధ్యలో నెలకొన్న రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదానికి మే నెలలోగా పరిష్కారం చూపాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకే డెడ్ లైన్లు పెడుతూ హెచ్చరికలు జారీ చేసింది. అయోధ్య వ్యవహారాల అధికార ప్రతినిధి శరద్ శర్మ ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఈ విషయానికి మే నెలలోగా పరిష్కారం చూపాల్సిందేనన్నారు. లేని పక్షంలో రామ మందిరం కోసం భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు తప్పవని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ‘‘అయోధ్యలో రామ మందిరం నిర్మాణాన్ని చిన్న విషయంగా పరిగణించడం లేదు. ముస్లింల పిటిషన్ నేపథ్యంలో ‘డిస్ప్యూటెడ్ ల్యాండ్’గా సర్కారు పేర్కొన్న మొత్తం 70 ఎకరాలు కావాల్సిందే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News