: ప్రపంచకప్ లో తొలి సెంచరీ బాదిన యూఏఈ బ్యాట్స్ మెన్... ఐర్లండ్ ముందు భారీ లక్ష్యం


ప్రపంచకప్ గ్రూప్-బిలో భాగంగా పసికూనలు యూఏఈ, ఐర్లాండ్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. యూఏఈ బ్యాట్స్ మెన్ అన్వర్ మెరుపు సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 83 బంతుల్లో 106 పరుగులు (10 ఫోర్లు, 1 సిక్సర్) చేసి స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా అన్వర్ రికార్డులకెక్కాడు. చివరకు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి యూఏఈ 278 పరుగులు చేసింది. ఐర్లండ్ బౌలర్లు స్టిర్లింగ్, కెవిన్ ఓబ్రెయిన్, క్యుసాక్, సోరెన్ సెన్ లు తలా రెండు వికెట్లు తీయగా, డాక్ రెల్ ఒక వికెట్ పడగొట్టాడు.

  • Loading...

More Telugu News