: ప్రముఖ సీనియర్ కెమెరామెన్ విన్సెంట్ కన్నుమూత


ప్రఖ్యాత సీనియర్ కెమెరామెన్ విన్సెంట్ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. కొన్ని రోజుల నుంచి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో న్యుమోనియాకు చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. జూన్ 14, 1928లో విన్సెంట్ జన్మించారు. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన తరువాత జెమినీ స్టూడియోలో స్టూడియో బాయ్ గా చేరారు. అనంతర కాలంలో అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేశారు. తరువాత తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పలు చిత్రాలకు కెమెరామెన్ గా వ్యవహరించారు. ప్రధానంగా తెలుగులో 'బ్రతుకు తెరువు', 'సొంత ఊరు', 'ఇల్లరికం', 'పెళ్లి కానుక', 'కుల గోత్రాలు', 'లేత మనసులు', 'భక్త ప్రహ్లాద', 'సోగ్గాడు', 'జ్యోతి', 'అడవి రాముడు', 'ప్రేమ లేఖలు', 'గడుసు పిల్లోడు', 'కేడీ నం 1', 'ధర్మక్షేత్రం', 'ఘరానా మొగుడు', 'ఆపద్బాంధవుడు', 'అశ్వమేధం', 'అల్లరి ప్రియుడు', 'మేజర్ చంద్రకాంత్', 'బొబ్బిలి సింహం', 'సాహసవీరుడు సాగరకన్య', 'అన్నమయ్య' వంటి పలు చిత్రాలకు కెమెరామెన్ గా పని చేశారు. మలయాళం, తమిళంలో కలిపి 30 సినిమాలకు విన్సెంట్ దర్శకత్వం వహించారు. ఆయన కుమారులు జయనన్ విన్సెంట్, అజయన్ విన్సెంట్ లు ప్రస్తుతం కెమెరామెన్ లుగా పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News