: ఒకేరోజు రెచ్చిపోయిన సచిన్, గేల్!


సమకాలీన క్రికెట్ ఆటగాళ్లలో దిగ్గజ క్రికెటర్ గా సచిన్ టెండూల్కర్, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే హిట్టర్ గా క్రిస్ గేల్ పేర్లు సుపరిచితమే. ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ లో ఇద్దరూ డబుల్ సెంచరీలతో అదరగొట్టారు. అయితే, ఇక్కడ మరో విశేషం ఏమంటే, సచిన్, గేల్ ఇద్దరూ ఫిబ్రవరి 24నే ఈ అరుదైన ఫీట్ ను సాధించారు. ఇంతవరకూ కాకతాళీయమే అనుకున్నా, ఆ మ్యాచ్ లలో ఇద్దరూ ఎదుర్కొన్న బంతులు కూడా సమానమే (147) కావడం గమనార్హం. 2010 లో దక్షిణాఫ్రికాపై 147 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్స్ లు కొట్టి సచిన్ 200 పరుగులతో నాటౌట్ గా నిలువగా, నిన్న జింబాబ్వేతో జరిగిన పోరులో 10 ఫోర్లు, 16 సిక్స్ ల సాయంతో గేల్ 215 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సచిన్ చేసింది వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ కాగా, గేల్ చేసింది అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ కావడం మరో విశేషం.

  • Loading...

More Telugu News