: ఎట్ల కూలుస్తారో కూల్చండి చూస్తాం... ప్రొక్లెయిన్ల ముందు బైఠాయించిన బెజవాడ మహిళలు


విజయవాడలోని ఓల్డ్ రాజరాజేశ్వరిపేట సమీపంలోని ఎర్రకట్ట వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎర్రకట్ట సమీపంలో వెలసిన ఇళ్లను కూల్చేందుకు నేటి ఉదయం నగరపాలక సంస్థ సిబ్బంది అన్ని ఏర్పాట్లతో వచ్చారు. అయితే అధికారుల నిర్ణయాన్ని తప్పుబట్టిన స్థానికులు, కూల్చివేతలను అడ్డుకున్నారు. ఆందోళనకారులను నెట్టేసిన అధికారులు ప్రొక్లెయిన్లతో ఇళ్లను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అక్కడి మహిళలు ఒక్కసారిగా ప్రొక్లెయిన్ల ముందు బైఠాయించారు. ఎట్ల కూలుస్తారో కూల్చండి, చూస్తామంటూ మహిళలు పెద్ద సంఖ్యలో ప్రతిఘటించడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. అయినా ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇళ్లను కూల్చివేస్తున్నామని, వీరికి జక్కంపూడిలో ఇళ్లు కట్టించి ఇస్తామని స్థానికులకు చెప్పారు. అయినా అక్కడి వారు ఆందోళనను విరమించేందుకు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News