: టీఆర్ఎస్ నేతల ఒత్తిళ్లు భరించలేం... లాంగ్ లీవ్ ఇవ్వండి: సర్కారుకు బెల్లంపల్లి మునిసిపల్ సిబ్బంది లేఖ
తెలంగాణలో తొలి సర్కారు ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని అధికారులపై తీవ్రమైన ఒత్తిడి చేస్తోందట. నిన్నటికి నిన్న మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మునిసిపల్ చైర్ పర్సన్ భర్త తమను దూషించారని ఆరోపిస్తూ కమిషనర్ సహా సిబ్బంది మొత్తం మూకుమ్మడిగా హాఫ్ డే లీవ్ పెట్టారు. తాజాగా 'టీఆర్ఎస్ నేతల ఒత్తిడిని భరించలేకున్నాం... లాంగ్ లీవ్ ఇవ్వండి' అంటూ ఆదిలాబాదు జిల్లా బెల్లంపల్లి మునిసిపల్ సిబ్బంది ఏకంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. మునిసిపల్ కమిషనర్ సహా కార్యాలయంలోని సిబ్బంది మొత్తం కలిసి ఈ లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.