: అన్నా హజారే బాటలో నడవనున్న కాంగ్రెస్!


సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చూపిన బాటలో నడవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మోదీ సర్కారు తీసుకువచ్చిన భూసేకరణ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని భావిస్తున్న ఆ పార్టీ ఢిల్లీలో మెగా ర్యాలీని, ఆపై జంతర్ మంతర్ వద్ద నిరసనను తెలపాలని నిర్ణయించింది. భూసేకరణ బిల్లు వద్దంటూ, హజారే రెండు రోజులపాటు చేపట్టిన నిరసన దీక్ష నిన్న ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, కాంగ్రెస్ ర్యాలీలో సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేష్, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు పాల్గొంటారని తెలుస్తోంది. చట్ట సభల్లో చర్చ జరగకుండా ఆర్డినెన్సుల ద్వారా బిల్లుల ఆమోదాన్ని ఎంతమాత్రమూ ఒప్పుకోరాదని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే భూసేకరణ బిల్లు వ్యతిరేక ర్యాలీ నిర్వహించి విజయవంతం చేయాలని భావిస్తోంది.

  • Loading...

More Telugu News