: తిరుమల వెంకన్నకు రూ. 5 కోట్లతో కేసీఆర్ చేయిస్తున్న ఆభరణాలు ఇవే


మొదటి నుంచి కూడా టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారంటే అమితమైన భక్తి. గతంలో ప్రతి ఏడాది తన కుటుంబం, కొంత మంది అనుచరులతో కలసి ఆయన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేవారట. ఒకానొక సందర్భంలో, ఆయన కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ సాధన కోసం అహర్నిశలు శ్రమించిన కేసీఆర్... రాష్ట్ర సాధన కోసం ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు. తెలంగాణ కల సార్థకం కావడంతో ఇప్పుడు ఆయన రాష్ట్రం తరపున మొక్కులు తీర్చుకునే పనిలో పడ్డారు. ఈ మొక్కుల కోసం దేవాదాయ శాఖ 'కామన్ గుడ్ ఫండ్' నుంచి రూ. 5.59 కోట్లను మంజూరు చేసింది. ఇందులో రూ. 5 కోట్లతో తిరుమల వెంకన్నకు ఆభరణాలు చేయిస్తున్నారు. కమలం నమూనాలో బంగారు సాలగ్రామ హారంతో పాటు, ఐదు పేటల హారాన్ని శ్రీవారికి చేయించాలని నిర్ణయించారు. మిగిలిన రూ. 59 లక్షలతో తిరుచానూరు అమ్మవారికి, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ముక్కుపుడకలు, వరంగల్ భద్రకాళి అమ్మవారికి రెండు కిలోల బంగారు కిరీటం, కురవిలోని వీరభద్రస్వామికి బంగారు మీసాలు చేయిస్తారు.

  • Loading...

More Telugu News