: భారతీయులకు అమెరికా బంపర్ ఆఫర్... మాట నిలబెట్టుకున్న ఒబామా!


హెచ్1-బీ వీసాలపై నిబంధనలు సరళతరం చేస్తానని హామీ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామా తన మాట నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగా, హెచ్1-బీ వీసాపై అమెరికాలో ఉంటున్నవారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకోవడానికి అమెరికా ప్రభుత్వం నుండి ఆమోదం లభించింది. ఈ సంవత్సరం మే 26 నుంచి ఇది అమల్లోకి రానుంది. గత నెలలో ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలకు అతిథిగా వచ్చిన ఒబామా, సమగ్ర వలస విధాన సంస్కరణల్లో భాగంగా హెచ్1-బీ అనుమతులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో అర్హతలు వుండి కూడా, నిబంధనల కారణంగా ఉద్యోగం చేసుకునే అవకాశం లేని భారతీయులకు ఇక మంచి రోజులు వచ్చినట్టే.

  • Loading...

More Telugu News