: తక్షణం దిగిపో... మధ్యప్రదేశ్ గవర్నర్ కు కేంద్రం సూచన


ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్‌ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని కేంద్రం సూచించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత కూడా పదవిలో కొనసాగడం సరికాదని తెలిపింది. కాగా, ఫారెస్ట్ గార్డుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డ కేసులో రామ్ నరేశ్ ప్రమేయంపై సాక్ష్యాలు ఉన్నాయని చెబుతూ, రాష్ట్రపతి అనుమతి తీసుకొని, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) నిన్న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 420తో పాటు, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. యాదవ్ ఐదుగురు అభ్యర్థుల పేర్లను ఫారెస్ట్ గార్డుల ఉద్యోగాల కోసం మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు అధికారులకు సిఫార్సు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News