: విభజన చట్టాన్ని తెలంగాణ అతిక్రమించింది: ఏపీ మంత్రి గంటా


రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అతిక్రమించిందని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నా పట్టించుకోకుండా కేసీఆర్ సర్కారు వ్యవహరించిందని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను విభజన చట్టం ఏపీకి కట్టబెట్టిందన్న మంత్రి, అందుకు విరుద్ధంగా తెలంగాణ సర్కారు విడిగా ఎంసెట్ నిర్వహణకు మొగ్గుచూపిందని ఆరోపించారు. తెలంగాణ సర్కారు దుందుడుకు వైఖరి కారణంగానే ఏపీ కూడా విడిగా ఎంసెట్ ను నిర్వహించుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News