: తిరుపతి టౌన్ క్లబ్ వద్ద ఉద్రిక్తత... పేకాటపై మహిళల నిరసన, గెంటేసిన నిర్వాహకులు
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కొలువై ఉన్న తిరుపతి నగరంలోని టౌన్ క్లబ్ వద్ద నేటి ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతి టౌన్ సోషియల్, కల్చరల్ క్లబ్ పేరిట వెలసిన క్లబ్ లో పేకాట జోరుగా సాగుతోంది. అయితే క్లబ్ లో పేకాట జరుగుతోందన్న విషయం తెలిసినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో క్లబ్ లో జరుగుతున్న పేకాటకు సంబంధించిన దృశ్యాలను సంపాదించిన ఓ తెలుగు న్యూస్ ఛానెల్, వాటిని ప్రసారం చేసింది. ఈ వార్తలతో నగరంలోని మహిళలు క్లబ్ వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన క్లబ్ నిర్వాహకుడు సతీశ్ తన అనుచరులతో మహిళలను గెంటేయించారు. ఎట్టకేలకు స్పందించిన పోలీసులు రంగ ప్రవేశం చేసి, పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.