: పసికూనల మధ్య మ్యాచ్... టాస్ గెలిచి యూఏఈకి బ్యాటింగ్ అప్పగించిన ఐర్లాండ్
వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా కొద్దిసేపటి క్రితం పసికూనలు ఐర్లాండ్, యూఏఈల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఐర్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని యూఏఈని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇప్పటికే వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న ఐర్లాండ్ నేటి మ్యాచ్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగింది. మరోవైపు యూఏఈ ఆడిన ఒక్క మ్యాచ్ లో పరాజయం పాలై, నేటి మ్యాచ్ లోనైనా బోణీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఐర్లాండ్ ఆహ్వానంతో బ్యాటింగ్ ప్రారంభించిన యూఏఈ నాలుగు ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమీ కోల్పోకుండా 23 పరుగులు చేసింది.