: విడిగానే ‘సెట్’ చేద్దాం... ఏపీ సర్కారు నిర్ణయం: నేడు ఎంసెట్ షెడ్యూల్ విడుదల


ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎంసెట్ ను విడిగానే నిర్వహించుకోవాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు నిన్న సాయంత్రం సీఎం నారా చంద్రబాబునాయుడు తుది నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష నిర్వహణను కాకినాడ జేఎన్టీయూకు అప్పగిస్తున్నట్టు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో నేడు ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. పరీక్షను మే నెల 10 నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News