: టీఎన్జీవో మాజీ నేత దేవీప్రసాద్ కు ఏపీ ఉద్యోగుల మద్దతు!
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, టీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ నిన్న ఆసక్తికర ప్రకటన చేశారు. తనకు ఏపీ ఉద్యోగులు కూడా మద్దతు ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బరిలోకి దిగిన తన పట్ల ఏపీ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన వెల్లడించారు. ఏపీ ఉద్యోగులకు తాను ఎంతమాత్రం వ్యతిరేకం కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా బుధవారం (నేడు) నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన నిన్న ప్రకటించారు.