: ప్రయాణికులతో ప్రైవేట్ ట్రావెల్స్ బంతాట... నడిరోడ్డుపై జాగారం చేయించిన ‘న్యూ ధనుంజయ’ బస్సు


తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. నిర్లక్ష్యంగా బస్సులను నడుపుతున్న డ్రైవర్లు ప్రయాణికులకు నిద్ర పట్టకుండా చేస్తుంటే, ట్రావెల్స్ యాజమాన్యాల చోద్యం కారణంగా ప్రయాణికులు రాత్రిళ్లు నడిరోడ్లపై జాగారం చేయాల్సి వస్తోంది. నిన్నటికి నిన్న కాకినాడ నుంచి హైదరాబాదుకు బయలుదేరిన ప్రయాణికులను బెజవాడ బందరు రోడ్డులో ఓ ట్రావెల్స్ బస్సు జాగారం చేయించింది. తాజాగా హైదరాబాదు నుంచి విశాఖ బయలుదేరాల్సిన ప్రయాణికులను న్యూ ధనుంజయ ట్రావెల్స్ ఔటర్ రింగు రోడ్డుపై జాగారం చేయించింది. రాత్రి 9.40 గంటలకు బయలుదేరాల్సిన బస్సు ఎంతకీ రాలేదు. దీంతో 11 గంటల సమయంలో ఇళ్లకు బయలుదేరిన ప్రయాణికులకు మరో బస్సు ఏర్పాటు చేశామంటూ ట్రావెల్స్ యాజమాన్యం ఫోన్లు చేసింది. ప్రయాణికులను బస్సులో ఎక్కించుకున్న డ్రైవర్ నగరమంతా తిప్పి, ఔటర్ రింగ్ రోడ్డుపై బస్సును నిలిపేశాడు. ఎయిర్ లాక్ అయ్యిందని చెప్పిన డ్రైవర్ బస్సును తెల్లవారుజామున కాని కదలించలేకపోయాడు. దీంతో రాత్రంతా ప్రయాణికులు రింగు రోడ్డుపై జాగారం చేయాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News