: ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు... ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు


ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నేటి తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు అద్దంకి, ఇంకొల్లు, పర్చూరు, చీరాల మండలాల్లో భూప్రకంపనలు సంభవించాయి. వరుసగా రెండుసార్లు భూమి కంపించిందని ప్రజలు భయంభయంగా చెబుతున్నారు. 2,3 సెకన్ల పాటే భూమి కంపించినా, గతంలో కంటే కాస్త ఎక్కువ ప్రభావంతోనే భూమి కంపించిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, తరచూ సంభవిస్తున్న భూ ప్రకంపనలతో నిత్యం భయాందోళనల్లో కాలం వెళ్లదీయాల్సి వస్తోందని జిల్లా వాసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News