: ఏపీకి ప్రత్యేక హోదా కోసం గుండు గీయించుకున్న కర్నూలు మాజీ మేయర్!
డిమాండ్ల సాధన కోసం వినూత్న నిరసనలకు దిగుతూ అందరి దృష్టిని ఆకర్షించే కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య మరోమారు తనదైన శైలిలో వినూత్న రీతిలో ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన నిన్న గుండు గీయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి తీరని నష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఫలితం అనుభవించిందన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.