: బెంగళూరులో రేపు కేటీఆర్ రోడ్ షో... పెట్టుబడుల కోసం!


ఐటీ రంగంలో పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్ట్ర సర్కారు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆయన రేపు బెంగళూరులో రోడ్ షోలో పాల్గొంటారు. హైదరాబాద్ నగరంలోని మౌలిక వసతులే ప్రధాన ఆకర్షణగా సంస్థలను ఆకట్టుకునేందకు ఈ రోడ్ షోలను ఉద్దేశించారు. సాఫ్ట్ వేర్ రంగంలో ప్రస్తుత అవకాశాలు, అభివృద్ధిపై హామీ ఇచ్చేలా ఈ రోడ్ షోలు సాగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పాలసీ ప్రధానాంశాలను కేటీఆర్ వివరించనున్నారు.

  • Loading...

More Telugu News