: జమీన్ వాప్సీ ర్యాలీలో పాల్గొనాలని కాంగ్రెస్ నేతల నిర్ణయం


అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే భూసేకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ మద్దతిస్తోంది. బుధవారం ఢిల్లీలో నిర్వహించనున్న జమీన్ వాప్సీ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. దిగ్విజయ్ సింగ్, అజయ్ మాకెన్, అహ్మద్ పటేల్, జైరాం రమేశ్, సల్మాన్ ఖుర్షీద్, జితేందర్ సింగ్, దీపిందర్ హుడా, రాజ్ బబ్బర్ ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఈ ర్యాలీని విజయవంతం చేసేందుకు ప్రజాసంఘాలు భారీ ఏర్పాట్లు చేశాయి.

  • Loading...

More Telugu News