: అబద్ధం చెబితే పట్టేస్తాయట!


విశ్వాసానికి శునకాలను మారుపేరుగా చెప్పుకోవడం తెలిసిందే. యుగాలుగా మనిషితో అత్యంత సన్నిహితంగా మెలిగే జంతువులుగా కుక్కలకు పేరుంది. మనుషులు అబద్ధం చెబితే శునకాలు వెంటనే పసిగట్టేస్తాయని ఓ అధ్యయనం చెబుతోంది. వస్తువుల పేర్లను తప్పుగా పేర్కొన్నా, దారి తప్పించేందుకు ప్రయత్నించినా అవి పట్టేస్తాయని జపాన్ పరిశోధకులు అంటున్నారు. ఓ వ్యక్తిపై ఒక్కసారి నమ్మకం కోల్పోతే ఇక ఎప్పటికీ వారు చెప్పిన మాట వినవట. అనుకున్నదానికంటే శునక జాతి తెలివైందని తమ పరిశోధనల ద్వారా వెల్లడైందని జపాన్ పరిశోధకులు వివరించారు. ఈ అంశంపై జపాన్ క్యోటో యూనివర్శిటీకి చెందిన అకికో టకయోకా బృందం అధ్యయనం చేపట్టింది.

  • Loading...

More Telugu News