: అన్నా హజారేని కలసి చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన వైకాపా నేత
భూసేకరణ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రముఖ సామాజికవేత్త, గాంధేయవాది అన్నా హజారే నిరశన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, అన్నాను వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కలిశారు. రాజధాని నిర్మాణం పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల నుంచి అన్యాయంగా భూములను లాక్కొంటున్నారని ఫిర్యాదు చేశారు. రాజధానికి రెండు వేల ఎకరాలు సరిపోతుందని తెలిపారు. మరో సామాజికవేత్త మేథా పాట్కర్ కూడా రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని చెప్పారు. అయితే, రాంబాబు ఫిర్యాదుపై అన్నా హజారే ఎలా స్పందించారన్న వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.