: జమ్ము కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం
జమ్ము కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పీడీపీ-బీజేపీ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ మధ్యాహ్నం పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిశారు. అనంతరం షా మాట్లాడుతూ, పీడీపీతో కలసి జమ్ము కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్టు తొలిసారి అధికారికంగా ప్రకటించారు. తమ అలయెన్స్ గురించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీని ముఫ్తీ కలసి మాట్లాడిన తరువాత కనీస ఉమ్మడి ప్రణాళిక విడుదల చేస్తామని తెలిపారు.