: చైనా 'యాపిల్' నుంచి కొత్త ఫోన్ 'ఎంఐ-4'


యాపిల్ ఫోన్లలోని అన్ని అధునాతన ఫీచర్లను కలిగుండే సెల్ ఫోన్లను తక్కువ ధరకు అందిస్తూ చైనా 'యాపిల్'గా పేరుతెచ్చుకున్న జియోమి మరో కొత్త స్మార్ట్ ఫోన్ 'ఎంఐ-4'ను విడుదల చేయనుంది. రెండు వేరియంట్లలో విడుదలయ్యే ఫోన్ అమ్మకాలను ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులో ఉంచాలని సంస్థ భావిస్తోంది. అయితే, ఎన్ని ఫోన్లు అమ్మకానికి అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని మాత్రం జియోమి ప్రకటించలేదు. 16 జీబీ వేరియంట్ ధరను రూ.19,999 గాను, 64 జీబీ వేరియంట్ ధరను రూ.23,999 గాను నిర్ణయించినట్టు తెలిపింది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేసే జియోమి ఎంఐ 4 ఫోన్లో క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 801 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 13 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర సదుపాయాలు ఉంటాయి.

  • Loading...

More Telugu News