: గల్ఫ్ ఆయిల్ కంపెనీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు


హైదరాబాద్ కూకట్ పల్లిలో ఉన్న గల్ఫ్ ఆయిల్ కంపెనీలో నిన్న పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గల్ఫ్ ఆయిల్ కంపెనీపై కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 304ఏ, 337, 338 ల కింద కేసు నమోదయింది. మరోవైపు, కంపెనీ యాజమాన్యం సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంపై కార్మికులు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News