: పొన్నం ప్రభాకర్ ను తరిమికొడతాం: టీఆర్‌ఎస్ నేత కిషన్‌ రెడ్డి


తెలంగాణ ప్రభుత్వ మంత్రులపై ఆరోపణలను మానుకోకపోతే, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్‌ను తెలంగాణ నుంచి తరిమికొడతామని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి హెచ్చరించారు. తక్షణం ఆయన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగదీష్‌ రెడ్డిపై పొన్నం చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు వుంటే, వాటిని బయటపెట్టాలని కిషన్ రెడ్డి అన్నారు. కేవలం ఉనికిని కాపాడుకునేందుకే ఆయన ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కలను సాకారం చేసిన ఉద్యమ నేతలపై ఆరోపణలు చేస్తే సహించబోమని అన్నారు.

  • Loading...

More Telugu News