: నేరాలను అరికట్టేందుకు గుంటూరు పోలీసుల కొత్త ఆలోచన


గుంటూరు జిల్లాలో నేరాలను అరికట్టడానికి జిల్లా అర్బన్ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఈ క్రమంలో ఓ డాక్యుమెంటరీకి శ్రీకారం చుట్టారు. లక్ష్మీపురం సెంటర్ లో 'ఆమె మనసులో ఏముంది' టైటిల్ తో తీస్తున్న ఈ షార్ట్ ఫిలింకు జిల్లా ఎస్పీ రాజేష్ కుమార్ క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి ఏఎస్ఐ శ్రీహరి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన నిర్మించిన లఘు చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దాంతో దీనిని కూడా ఆయనే రూపొందిస్తున్నారు. విద్యార్థులు, చిన్నపిల్లలు మొదటి నుంచే చెడు అలావాట్లు పట్టకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ సూచించారు. నగరాల్లో నేరాలను అరికట్టేందుకు సందేశాత్మక చిత్రాలు ప్రజలకు, పోలీసులకు సహాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News