: టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీటీడీపీ ఎమ్మెల్యే దీక్ష
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఏపీలోని టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టబోతున్నారు. నమ్మలేకపోయినప్పటికీ, ఇది నిజం. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మార్చి 1వ తేదీన నెల్లూరులో దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. 36 గంటల పాటు ఈ దీక్ష కొనసాగుతుందని ఆయన తెలిపారు. బీసీ ఉప ప్రణాళికకు ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. మరి ఈ దీక్షకు అధినేత చంద్రబాబు అనుమతి తీసుకున్నారా? లేదా? అనే విషయం మాత్రం వెల్లడికాలేదు.