: 50 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు 372... 147 బంతుల్లో 215 పరుగులు చేసిన గేల్!
వరల్డ్ కప్ లో భాగంగా నేటి మ్యాచ్ లో వెస్టిండీస్ రికార్డుల మోత మోగించింది. వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ సునామీ ఇన్నింగ్స్ తో నిర్ణీత 50 ఓవర్లలో వెస్టిండీస్ 372 పరుగులు సాధించింది. గేల్ ఒక్కడే 147 బంతుల్లో 215 పరుగులు చేశాడు. అతడికి పూర్తిగా సహకరించిన మార్లన్ శామ్యూల్స్ (156 బంతుల్లో 133 పరుగులు) శతకం సాధించాడు. రెండో బంతికే తొలి వికెట్ కోల్పోయిన వెస్టిండీస్, ఆ తర్వాత గేల్, శామ్యూల్స్ విజృంభణతో మరో వికెట్ కోల్పోకుండానే చివరి వరకూ బ్యాటింగ్ కొనసాగించింది. చివరి బంతికి గేల్ ఔటయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన క్రిస్ గేల్ చివరి దాకా క్రీజులో నిలిచి రికార్డు సృష్టించాడు. గేల్ సునామీ ఇన్నింగ్స్ తో బెంబేలెత్తిన జింబాబ్వే, 373 పరుగుల విజయ లక్ష్యంతో మరికొద్దిసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది.