: 163 కేసుల్లో నిందితుడు, గజదొంగ ఖలీల్ అరెస్ట్


దొంగతనాలతో పలువురిని హడలెత్తిస్తున్న గజదొంగ ఖలీల్‌ ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఖలీల్‌ తో పాటు మరో ఆరుగురుని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు నేడు తెలిపారు. ఖలీల్ పై మొత్తం 163 కేసులున్నట్టు తెలిపారు. నిందితుల నుంచి భారీగా బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని, ఇందులో 63 తులాల బంగారం, కిలోన్నర వెండి, కిలో గంజాయి, ఒక కారు వున్నాయని తెలిపారు. హైదరాబాదులోని పలు పోలీస్ స్టేషన్లలో ఖలీల్ ముఠాపై చోరీ కేసులు పెండింగ్ లో వున్నాయని తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరచనున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News