: గేల్ రికార్డుల హిట్టింగ్... వరల్డ్ కప్ తో తొలి డబుల్... వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ కూడా!


చెత్త ఆటతీరుకు స్వస్తి చెప్పి ఫామ్ లోకొచ్చిన మరుక్షణమే వెస్టిండీస్ సంచలనం క్రిస్ గేల్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. నేటి ఉదయం వరల్డ్ కప్ లో భాగంగా జింబాబ్వేతో మొదలైన మ్యాచ్ లో సెంచరీ పూర్తయ్యే దాకా కాస్త నెమ్మదిగానే బ్యాటింగ్ చేసిన అతడు శతకం పూర్తి కాగానే జూలు విదిల్చాడు. సిక్స్ లతో చెలరేగిన క్రిస్ గేల్ దూకుడుతో జింబాబ్వే బౌలర్లు బెంబేలెత్తిపోయారు. 138 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. 106 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసిన గేల్, ఆ తర్వాత 32 బంతుల్లోనే మరో వంద పరుగులు చేశాడు. 16 సిక్స్ లతో మోత మోగించిన గేల్, 9 ఫోర్లతో జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు. వరల్డ్ కప్ లో తొలి డబుల్ సెంచరీ సాధించిన గేల్, వన్డేల్లో అత్యంత వేగవంతంగా (138 బంతుల్లో) డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్ గా కూడా అవతరించాడు. అంతేకాక, వన్డే క్రికెట్ లో అత్యధిక సిక్స్ లు బాదిన బ్యాట్స్ మన్ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. నేటి మ్యాచ్ తో 400 సిక్స్ ల మైలురాయిని అందుకున్న గేల్, ఈ విషయంలో పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది(447 సిక్స్ లు) తర్వాత స్థానంలో నిలిచాడు.

  • Loading...

More Telugu News