: కేసీఆర్ పై ఎర్రబెల్లి ఆగ్రహం


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన టీ.టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడుతున్నారు. తెలంగాణ ద్రోహులను టీఆర్ఎస్ లో ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేకులకు ఆ పార్టీ అనుకూలంగా ఉంటుంటే తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు ప్రశ్నించడం లేదని సూటిగా అడిగారు. టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్, తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణను ఇబ్బందిపెడుతుంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. అన్యాయం జరిగితే అడిగేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణను కరవు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇక ఎస్ఆర్ఎస్పీ ఎడారిగా మారుతుంటే మామ, అల్లుడు (కేసీఆర్, హరీశ్ రావు) మహారాష్ట్రకు వెళ్లి ఏం సాధించుకువచ్చారని అడిగారు. తెలంగాణ సచివాలయంలో మీడియాపై ఆంక్షలను టీడీపీ సహించదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News