: అన్నాకు పాదాభివందనం చేసిన కేజ్రీవాల్... ఈ రోజు అన్నాతో కలసి కేజ్రీవాల్ నిరసన
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రముఖ సామాజికవేత్త, గాంధేయవాది అన్నా హజారే ఒక్కటయ్యారు. నిన్న సాయంత్రం అన్నాను కలసిన కేజ్రీవాల్... ఆయన పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం దాదాపు గంటసేపు వీరు చర్చించారు. సమావేశం అనంతరం, కేజ్రీవాల్ అత్యంత ఆప్తుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ, కేజ్రీవాల్, తాను ఇద్దరం జంతర్ మంతర్ వద్ద అన్నా చేస్తున్న నిరసన కార్యక్రమానికి హాజరవుతామని... వేదికపై అన్నాతో కలసి కూర్చుంటామని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ సెషన్ ముగిసిన తర్వాత, మధ్యాహ్నం 3 గంటలకు నిరసన కార్యక్రమానికి హాజరవుతామని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకురావాలనుకుంటున్న భూ సేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ అన్నా నిరసన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.