: మత మార్పిడి కోసమే మదర్ థెరిసా సేవలు... ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్... దయచేసి విమర్శించొద్దన్న కేజ్రివాల్


భారతరత్న మథర్ థెరిసాపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రాజస్తాన్ లోని ఒక గ్రామంలో ఆయన ప్రసంగిస్తూ, ఆమె సేవల వెనుక ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చాలన్న ఆలోచనలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించాడు. భగవత్ ప్రసంగంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ కాస్త గట్టిగా స్పందిస్తూ, "నేను ఆమెతో కలసి కోల్ కతాలోని నిర్మల్ హృదయ్ ఆశ్రమంలో పని చేశాను. ఆమె నిర్మల మనసుతో, ప్రతిఫలం ఆశించకుండా సేవలు చేశారు. ఆమెను దయచేసి విమర్శించ వద్దు" అన్నారు. కాగా, విమర్శల ధాటికి ఆర్ఎస్ఎస్ దిగివచ్చింది. భగవత్ వ్యాఖ్యలను మీడియా తప్పుగా ప్రచురించిందని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.

  • Loading...

More Telugu News