: భూసేకరణ బిల్లుపై చర్చకు రాజ్యసభలో కాంగ్రెస్ పట్టు
భూసేకరణ బిల్లుపై తక్షణమే చర్చ చేపట్టాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఆర్డినెన్స్ ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సిందేనని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, ఈ వ్యాఖ్యలను ఖండించారు. దేశంలో ఇప్పటివరకు 636 ఆర్డినెన్స్ లు వచ్చాయని చెప్పారు. అందులో 80 శాతం కాంగ్రెస్ పాలనలో ఇచ్చినవేనని గుర్తు చేశారు. ఇలా ఆర్డినెన్స్ పేరుతో సభను అడ్డుకోవడం సరికాదని జైట్లీ అన్నారు. ప్రజా ప్రయోజనం కోసమే కాంగ్రెస్ పాలనలో ఆర్డినెన్స్ లు తీసుకొచ్చామని ఆనంద్ శర్మ తెలిపారు. కానీ పారిశ్రామికవేత్తలకు లబ్ధి కలిగించేందుకు ఈ ఆర్డినెన్స్ తెస్తున్నారని ఆరోపించారు.