: భూ సేకరణ బిల్లు భేషుగ్గా ఉంది... వెనక్కు తగ్గేది లేదన్న ప్రధాని మోదీ


పార్లమెంటు ఉభయ సభల్లో భూ సేకరణ బిల్లు పెను చర్చకు దారితీయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఓ వైపు బిల్లుకు చేసిన సవరణలపై విపక్షాలతో పాటు సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే ప్రధాని నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించగా, బిల్లుపై వెనక్కు తగ్గేది లేదని బీజేపీ ప్రకటించింది. పార్లమెంటు రెండో రోజు సమావేశాల ప్రారంభానికి ముందు నేటి ఉదయం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. సమావేశంలో బిల్లుపై మాట్లాడిన ప్రధాని మోదీ, సభలో అనుసరించాల్సిన వైఖరిపై పార్టీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. బిల్లు భేషుగ్గానే ఉందన్న మోదీ, దీనిపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ప్రకటించారు. పార్టీ సభ్యులు, మంత్రులు ఆ దిశగా సన్నద్ధమై సమావేశాలకు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News