: నా కోసం ఎంత బాధ అనుభవించావు... ఇంకెప్పుడూ అలా చెయొద్దు!: వీరాభిమానికి జయలలిత లేఖ
తాను తిరిగి ముఖ్యమంత్రిని కావాలని ఒక వీరాభిమాని సిలువ వేయించుకోవడంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్పందించారు. ఎటువంటి చర్యలు కూడవని ఆ అభిమానికి స్వయంగా లేఖ రాశారు. నిన్న చెన్నైలో తిరు హుసైనీ అనే ఒక అభిమాని సిలువ వేయించుకున్న సంగతి తెలిసిందే. "నాకు మద్దతుగా నిలిచినందుకు ఎంతో ఆనందంగా వుంది. నా కోసం చాలా బాధ అనుభవించావు. ఈ సంగతి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇంకెప్పుడూ, శరీరానికి బాధ కలిగించే ఈ తరహా చర్యలు వద్దు. నీ భావి జీవితం గురించి ఆలోచించు. గాయాలపాలు కావద్దు" అని ఆ లేఖలో తెలిపారు. గత సంవత్సరం జైలు శిక్ష పడిన తరువాత ఆమె తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.