: విషపదార్థాల్ని ఇట్టే పసిగట్టి, కట్టడి చేయొచ్చు
ఆహారం కలుషితం అయిన సందర్భాల్లో.. చాలా తీవ్రమైన ప్రమాదాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకరికి అనారోగ్య లక్షణం కనపడి అప్రమత్తం అయ్యేలోగానే.. పదులు, వందల సంఖ్యల్లో కూడా చటుక్కున అనారోగ్యం బారిన పడిపోతుంటారు. అలాంటి సందర్భాలకు ఈ ఆవిష్కరణ ఒక విరుగుడు. కలుషితమైన ఆహారాన్ని వేగంగా, కచ్చితంగా గుర్తించే ప్రక్రియను శాస్త్రవేత్తలు రూపొందించారట. మిసౌరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగాల్లో విషపదార్థాలు త్వరగా వ్యాపించకుండా అడ్డుకుంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చని తేల్చారు.
అయితే ఈ విషపదార్థాలను కనుగొనడంలో ప్రస్తుతం ఎలీసా అనే పద్ధతి వాడుతున్నారు. దానికంటె నానోపదార్థాల్తో కూడిన కొత్త ప్రక్రియ వంద రెట్ల కచ్చితత్వంతో కలుషితమైన దానిని గుర్తిస్తుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్ శుభ్ర గంగోపాధ్యాయ అంటున్నారు. దీనివల్ల ముప్పును గుర్తించడానికి ప్రస్తుతం ఆరుగంటలు పడుతోంటే.. ఇక గంటలోగా తేల్చవచ్చని చెబుతున్నారు.