: రెండో బంతికే విండీస్ తొలి వికెట్... జింబాబ్వేతో మ్యాచ్ లో డ్వేన్ స్మిత్ డకౌట్


వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన గ్రూప్-బీ లీగ్ మ్యాచ్ లో వెస్టిండీస్ కు జింబాబ్వే బౌలర్లు షాకిచ్చారు. తొలి ఓవర్ రెండో బంతికే విండీస్ ఓపెనర్ డ్వేన్ స్మిత్ ను జింబాబ్వే బౌలర్ తినాషే పన్యాంగరా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ జట్టు, 12 ఓవర్లు ముగిసేసరికి 51 పరుగులు చేసింది. ఫామ్ లో లేని క్రిస్ గేల్, నేటి మ్యాచ్ లో మళ్లీ ఊపందుకున్నట్టే ఉంది. 33 బంతులు ఎదుర్కొన్న అతడు 30 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో శామ్యూల్స్ 17 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News