: రూర్కెలా వద్ద రోడ్డు ప్రమాదం... వధువు సహా ఐదుగురి దుర్మరణం


ఒడిశాలో నేటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని రూర్కెలా వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. పెళ్లి బృందంతో వెళుతున్న జీపును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువుతో పాటు ఆమె బంధువుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. దీంతో కొన్ని గంటల్లో జరగాల్సిన పెళ్లి అర్థాంతరంగా నిలిచిపోయింది. ఈ ఘటనతో అటు వధువు కుటుంబంతో పాటు వరుడి కుటుంబం కూడా తీవ్ర విషాదంలో కూరుకుపోయింది.

  • Loading...

More Telugu News